వసంత్ విల్లాస్‌లో చెడ్డిగ్యాంగ్ హల్ చల్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చెడ్డిగ్యాంగ్ మరోసారి రెచ్చిపోతోంది. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నా, నిరంతరం నిఘా ఉంచి గస్తీ తిరుగుతున్నా చెడ్డిగ్యాంగ్ మాత్రం ఎక్కడో చోట తమ చేతివాటం

Update: 2023-08-11 06:11 GMT

దిశ, శేరిలింగంపల్లి : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చెడ్డిగ్యాంగ్ మరోసారి రెచ్చిపోతోంది. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నా, నిరంతరం నిఘా ఉంచి గస్తీ తిరుగుతున్నా చెడ్డిగ్యాంగ్ మాత్రం ఎక్కడో చోట తమ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న అమీన్ పూర్ లో అర్ధరాత్రి ఓ ఇంటిలో దొంగతనానికి పాల్పడగా, గత శనివారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత విల్లాస్ లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేసింది. తాళం వేసి ఉన్న డాక్టర్ రామ్ సింగ్ విల్లా నెంబర్ 75 లోకి చొరబడిన చెడ్డిగ్యాంగ్ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గత శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారని సమాచారం. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు చెడ్డి గ్యాంగ్ కదలికలపై సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాదాపూర్ ఎస్ ఓటి, సిసిఎస్, క్రైమ్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి చెడ్డి గ్యాంగ్ కోసం గాలిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న చెడ్డిగ్యాంగ్ చోరీలు ఇప్పుడు జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.


Similar News