మా ఇంట్లో సిమెంట్ పడుతుందని ప్రశ్నించినందుకు దాడి
మా ఇంట్లో సిమెంట్ పడుతుంది ప్రశ్నించినందుకు ఓ వ్యక్తిపై మాజీ కార్పొరేటర్ భర్త దాడి చేసి గాయపరిచిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.

దిశ, మీర్ పేట్ : మా ఇంట్లో సిమెంట్ పడుతుంది ప్రశ్నించినందుకు ఓ వ్యక్తిపై మాజీ కార్పొరేటర్ భర్త దాడి చేసి గాయపరిచిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో నీ జిల్లెల గూడ లో నివాసముండే కాంగ్రెస్ పార్టీ 42 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సిద్దాల మౌనిక భర్త సిద్దాల శ్రీశైలం ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారు. పక్క ఇంట్లో నివాసముండే ఆంజనేయులు తన ఇంట్లో సిమెంట్ పడుతుందని ప్రశ్నించినందుకు ఇద్దరి మధ్య మాట మాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తన పై శ్రీశైలం దాడి చేసి గాయపరిచాడని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.