చెరువు అలుగులో నిర్మించిన హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి..

కాముని చెరువు అలుగులో నిర్మించిన హైదరాబాద్ గ్రాండ్ హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని శంషాబాద్ సీపీఐ మండల కార్యదర్శి గిరి డిమాండ్‌ చేశారు.

Update: 2023-02-20 14:32 GMT

దిశ, శంషాబాద్ : కాముని చెరువు అలుగులో నిర్మించిన హైదరాబాద్ గ్రాండ్ హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని శంషాబాద్ సీపీఐ మండల కార్యదర్శి గిరి డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాముని చెరువు అలుగులో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం శంషాబాద్ డిప్యూటీ తాసిల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేసిన మండల కార్యదర్శి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్నశంషాబాద్ మండల కేంద్రంలో బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న కామునిచెరువు ఎఫ్టీఎల్, బపర్ జోన్, చెరువు అలుగులో నిర్మించిన అక్రమ నిర్మాణదారులకు అలుగులో నిర్మించిన హైదరాబాద్ గ్రాండ్ హోటల్ యాజమాన్యం పై చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్ కేసులునమోదు చేయాలని అన్నారు.

లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉన్న అధికారులు హోటల్ యాజమాన్యాలతో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలు చేయడానికి సహకరించారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని గిరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రాజు, నరేష్, శారద, అనిత, ప్రమీల, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News