మత సామరస్యానికి ప్రతీక రంజాన్

రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Update: 2025-03-19 15:40 GMT
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
  • whatsapp icon

దిశ, చార్మినార్ : రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి పొన్నం ప్రభాకర్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో బుధవారం పాతబస్తీ ఖిల్వత్ లోని చౌమహల్లా ప్యాలెస్ లో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రంజాన్ పండుగ హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఇలాంటి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ నగర పోలీసులకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో సైతం ఇలాగే పోలీస్ అధికారులు మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల నుంచి మన్ననలు పొందాలన్నారు.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలోని ప్రజలు గంగా జమున తైజీబ్లా కలిసి మెలిసి ఇలా ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషకర విషయమన్నారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు నగర పోలీసులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర పోలీసు అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, పోలీసు ఉన్నతాధికారులు ఏకె ఖాన్, దక్షిణ మండల డిసిపి స్నేహ మెహ్రా, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎమ్మెల్యేలు మీర్ జుల్ఫికర్ అలీ. జాఫర్ హుస్సేన్, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీ అఫంధి తోపాటు మజ్లిస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు

Similar News