Rajeev Yuva Vikasa : రాజీవ్ యువ వికాస దరఖాస్తుల గడువు పెంపు
తెలంగాణలో యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభత్వం ప్రవేశ పెట్టిన కీలక పథకం "రాజీవ్ యువ వికాస"(Rajeev Yuva Vikasa).
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభత్వం ప్రవేశ పెట్టిన కీలక పథకం "రాజీవ్ యువ వికాస"(Rajeev Yuva Vikasa). అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ 5. అయితే దరఖాస్తుల స్వీకరణలో రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాస దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ(Applications Extended) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఓ ప్రకటన జారీ చేశారు. అయితే ఈ పథకానికి అప్లై చేసుకునే వారికి మరో వెసులుబాటును కల్పించారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి ఆదాయ ధృవీకరణపత్రం అవసరం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు, పురుషులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.
ఇందుకోసం ఆయా కార్పొరేషన్లకు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది సర్కార్. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు. అయితే ఒక రేషన్ కార్డు మీద ఒక లబ్దిదారుడు మాత్రమే ఈ పథకాన్ని పొందనున్నారు. ఇక ఈ పథకంలో లబ్దిదారులకు అందించే రుణాలను 3 కేటగిరీలుగా విభజించింది సర్కార్. క్యాటగిరీ 1 కింద రూ.లక్ష రుణం అందిస్తుండగా.. ఇందులో 80 శాతం రాయితీ ఇవ్వనున్నారు. క్యాటగిరీ 2 లో రూ. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణం అందించగా.. ఇందులో 70 శాతం రాయితీ ఇవ్వనున్నారు. క్యాటగిరీ 3 లో రూ.2 లక్షల నుంచి 3 లక్షల వరకు రుణం అందించగా.. అందులో 60 శాతం రాయితీ ఇవ్వనున్నారు.