జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్.. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రియాక్షన్ ఇదే!

తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీ (Delhi) స్థాయిలో కుట్రలకు తెర లేపారని ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-04-14 09:33 GMT
జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్.. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రియాక్షన్ ఇదే!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీ (Delhi) స్థాయిలో కుట్రలకు తెర లేపారని ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంలో ధర్మరాజుల ఉండాల్సిన సొంత జిల్లా నేత జానారెడ్డి (Janareddy) ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నాడని ఫైర్ అయ్యారు. తనకు మంత్రి పదవి ఖాయమైనా.. కావాలనే జానా పదేపదే అడ్డుపడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో ఉన్న జానారెడ్డికి.. ఇప్పుడు కొత్తగా రంగారెడ్డి జిల్లా (Rangareddy District) నేతలపై ప్రేమ పుట్టుకొచ్చిందని కామెంట్ చేశారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ (MLC Shankar Nayak)స్పందించారు. నల్లగొండ జిల్లా (Nalgonda District) కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే.. అడ్డుకునే వ్యక్తిత్వం జానారెడ్డి (Janareddy)ది కాదని స్పష్టం చేశారు. జిల్లాకు మూడో మంత్రి పదవి వస్తుందంటే తాము కూడా సంతోషిస్తామని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి.. జానారెడ్డి రాసిన లేఖకు సంబంధమే లేదని అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యున్నతికి జానారెడ్డి ఎంతో కష్టపడి పని చేశారని శంకర్ నాయక్ తెలిపారు.  

Tags:    

Similar News