Railway News: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నెల రోజుల పాటు ఆ రైలు సర్వీసులు రద్దు!

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకోబోతోంది.

Update: 2024-07-25 03:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకోబోతోంది. హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో కొనసాగుతున్న మరమ్మతుల కారణంగా ఆ జోన్‌ పరిధిలోని పలు రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే నిర్ణయించింది. కాగా, రద్దయ్యే రైళ్ల వివరాలను బుధవారం అధికారులు వెల్లడించారు. అందులో గుంతకల్‌ - బీదర్‌ ఆగస్టు 1 నుంచి 31 వరకు, బోధన్‌ - కాచిగూడ ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 1, కాచిగూడ- గుంతకల్‌ ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్‌ 1, కాచిగూడ- రాయచూర్‌ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 రద్దు కానున్నాయి. అదేవిధంగా రాయచూర్‌ - గద్వాల్‌ ఆగస్టు 1-31 వరకు, గద్వాల్‌ -రాయచూర్‌ ఆగ‌స్టు 1 నుంచి 31 వరకు, రాయచూర్‌-కాచిగూడ ఆగస్టు 1 నుంచి 31 వరకు, కాచిగూడ- నిజామాబాద్‌ ఆగస్టు 1 నుంచి 31 వరకు, నిజామాబాద్‌-కాచిగూడ ఆగస్టు 1 నుంచి 31 వరకు, మేడ్చల్‌-లింగంపల్లి ఆగస్టు 1 నుంచి 31 వరకు, లింగంపల్లి-మేడ్చల్‌, మేడ్చల్‌ -సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ – మేడ్చల్‌ రైళ్లు ఆగస్టు 1 నుంచి 31 వరకు రైళ్లు రద్దు చేస్తున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News