ఫోన్ ట్యాపింగ్ కేస్.. కేసీఆర్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. శనివారం హైదరాబాద్ శివారులోని

Update: 2024-04-06 14:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. శనివారం హైదరాబాద్ శివారులోని తక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత సీఎం కేసీఆర్ ఎలా పని చేశారో మీకందరికి తెలుసు. కేసీఆర్ వేలాదిమంది ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించారు. రెవెన్యూ, ఇంటిలిజెన్స్ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా నదుల్లో పడేశారు. బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఇక్కడ కేసీఆర్ చేసింది.. కేంద్రంలో ప్రధాని మోడీ చేస్తున్నారు. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది. దేశంలోనే బీజేపీ అతిపెద్ద వాషింగ్ మెషిన్‌‌గా మారింది. దేశంలోని అతినీతిపరులందరూ మోడీ ముందు నిల్చున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లోనూ మోడీ మనుషులు ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్రపంచలోనే అతిపెద్ద స్కామ్ జరిగింది’’ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 


Similar News