Raghunandan Rao : పాత బీఆర్ఎస్, కొత్త కాంగ్రెస్ సర్కార్‌లా తీరుపై పార్లమెంట్‌‌లో రఘునందన్ స్పీచ్

దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించే విధంగా ఫైనాన్స్ బిల్ ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

Update: 2024-08-07 13:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించే విధంగా ఫైనాన్స్ బిల్ ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తాజాగా ఆయన పార్లమెంట్‌లో ఫైనాన్స్ బిల్‌పై మాట్లాడిన వీడియో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇన్కమ్ టాక్స్ విభాగం, ఇతర విభాగాలలో కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలో సర్కార్ పారదర్శకత తీసుకువచ్చిందని వెల్లడించారు. దేశ ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వం మీద నమ్మకం పెంచుకున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పాత బీఆర్ఎస్ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు రెండు కూడా మంచి జరిగితే తమదిగా, ఏదైనా పని జరగకపోతే కేంద్రం మీద నెట్టడం చేస్తారని ఆరోపించారు. కేంద్రం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరు మీద నిధులు ఇచ్చినా కూడా కేసీఆర్ డబుల్ బెడ్ రూం అని తానే డబ్బులు ఇస్తున్నట్టు, రేవంత్ సర్కారు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మభ్య పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ కు డైరెక్ట్ ఫండ్ కింద 48,000 కోట్లు వచ్చినా తెలంగాణ సర్కారు తప్పుడు లెక్కలు చెప్తోందని ఆరోపించారు. నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ అర్దం కావాలంటే నిరుపేదల ఆకాంక్షల ద్వారా చూస్తేనే అర్థమవుతుందని వెల్లడించారు.

Tags:    

Similar News