GO 46 : చీకట్లో ప్రజాభవన్ ముందు జీవో 46 బాధితుల నిరసన
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నంబర్ 46ను రద్దు చేయాలని శుక్రవారం హైదరాబాద్‌లోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ వద్ద బాధిత అభ్యర్థులు మధ్యాహ్నం నుంచి నిరసన తెలియజేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నంబర్ 46ను రద్దు చేయాలని శుక్రవారం హైదరాబాద్‌లోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ వద్ద బాధిత అభ్యర్థులు మధ్యాహ్నం నుంచి నిరసన తెలియజేశారు. రాత్రి అవుతున్న కూడా ప్రజా భవన్ ముందు అభ్యుర్థులు నిరసన కొసా సాగించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు.
మంత్రుల చుట్టూ తిరిగి తిరిగి తమకు ఓపిక నశించి పోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చిందని, హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఉద్యోగ భర్తీల విషయంలో జీవో 46ను జారీ చేసిందని గుర్తు చేశారు. దీని వల్ల తమకు అన్యాయం జరుగుతోందని, వెంటనే జీవో నెంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.