Mahesh Kumar Goud: నవంబర్ 2న అన్ని జిల్లాల్లో కీలక సమావేశాలు.. డీసీసీలకు పీసీసీ చీఫ్ దిశానిర్దేశం
నవంబర్ 2న అన్ని జిల్లాల్లో కీలక సమావేశాలు నిర్వహించాాలని డీసీసీలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కలిసి కుల గణనన (Caste Census )విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అండగా నిలబడుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Pcc Chief Mahesh Kumar Goud) అన్నారు. నవంబర్ 2న 33 జిల్లాలో కులగణనపై డీసీసీ (DCC) అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బుధవారం గాంధీ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణనపై తలెత్తే అనుమానాలపై గాంధీభవన్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామన్నారు. కులగణన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారుర. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ (Rahul Gnahdi) కుల గణనపై స్పష్టమైన ప్రకటన చేశారని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు.