Priyanka: మూడు రోజుల్లోగా ప్రతిపాదనలు పంపండి

స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వేస్ట్ మెంట్(సాస్కీ) పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు

Update: 2025-01-04 13:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వేస్ట్ మెంట్(సాస్కీ) పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు మూడు రోజుల్లోగా పంపాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి సీహెచ్. ప్రియాంక అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం పథకం (స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వేస్ట్ మెంట్-సాస్కీ) పార్ట్ -9 పై పురపాలక శాఖ విభాగాలు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీయూఎఫ్ఐడీసీ, సీడీఎంఏ, టౌన్ ప్లానింగ్, వాటర్ బోర్డు, కులీకుతూబ్షా అర్బన్ డవలప్ మెంట్ ఆథారిటీ, ప్రజారోగ్య ఇంజినీరింగ్‌కు చెందిన అధికారులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి సమావేశం నిర్వహించారు.

ఈ పథకం కింద తెలంగాణతో సహా దేశంలో ఇతర రాష్ట్రాలలో చేపట్టే పనులకు రూ.5,000 కోట్లు మూలధన పెట్టుబడి కింద అందించేందుకు అంగీకరిస్తూ వీటిలో రూ.2,500 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సాస్కీ పథకం కింద పురపాలక శాఖ పరిధిలోని వివిధ విభాగాలలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలతో కూడిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాల్సి ఉందన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని పురపాలక శాఖ పరిధిలోని విభాగాల అధిపతులు పథకం కింద నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి తమ ప్రతిపాదనలను వచ్చే మంగళవారంలోగా పంపాలని సూచించారు. ఈ సమావేశంలో వాటర్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి, హెచ్ఎండీఏ, టీయూఎఫ్ఐడీసీ, సీడీఎంఏ, టౌన్ ప్లానింగ్, వాటర్ బోర్డు, కులీకుతూబ్షా అర్బన్ డవలప్ మెంట్ ఆథారిటీ, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News