బ్రేకింగ్: తెలంగాణపై ప్రధాని మోడీ వరాల జల్లు
తెలంగాణకు ప్రధాని మోడీ వరాల జల్లు కురిపించారు. ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీ.. 13,500 కోట్ల ఖర్చుతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణపై ప్రధాని మోడీ వరాల జల్లు కురిపించారు. ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. 13,500 కోట్ల ఖర్చుతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రధాని వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ములుగు జిల్లాలో నేషనల్ సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.900 కోట్లతో నిర్మి్ంచనున్న ఈ యూనివర్శిటీకి సమ్మక్క-సారక్క పేరు పెడుతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్థాయిని పెంచుతున్నామని.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ మారనుందని తెలిపారు. కృష్ణపట్నం-పాలమూరు మధ్య మల్టీ పర్పస్ పెట్రో పైప్ లైన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని.. దీని ద్వారా యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి సౌకర్యాలు లభిస్తాయన్నారు. వరంగల్ – ఖమ్మం – విజయవాడ హైవే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిని మోడీ జాతికి అంకితం చేశారు.
Read More..
బిగ్ బ్రేకింగ్: తెలంగాణకు ప్రధాని మోడీ భారీ గిఫ్ట్.. పాలమూరు సాక్షి సంచలన ప్రకటన