తెలంగాణలో అనుహ్యంగా మారిన పొలిటికల్ ట్రెండ్.. ఆ పార్టీ పుంజుకోవడంతో BRS అలర్ట్!
రాష్ట్రంలో రాజకీయ ట్రెండ్లు క్రమంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నాళ్లు బీఆర్ఎస్వర్సెస్బీజేపీ అనే స్థాయిలో ఫైట్ కొనసాగింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ ట్రెండ్లు క్రమంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నాళ్లు బీఆర్ఎస్వర్సెస్బీజేపీ అనే స్థాయిలో ఫైట్ కొనసాగింది. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్గ్రాఫ్పెరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్వర్సెస్కాంగ్రెస్అనే స్థాయిలో రాజకీయం కొనసాగుతున్నది.
బీఆర్ఎస్పార్టీ కూడా బీజేపీని లైట్ తీసుకొని, కాంగ్రెస్‌పై ఫోకస్ పెంచింది. హస్తం పార్టీకి పోటీగా గులాబీ నేతలు రాజకీయ ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న సభలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్‌పార్టీ సభలను గమనిస్తున్న బీఆర్ఎస్, నిర్లక్ష్యం వహిస్తే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని గ్రహించింది.
గతంలో పోల్చితే కాంగ్రెస్‌పార్టీ సభలకు జనాలు స్వచ్ఛందంగా రావడం షురూ అయింది. దీంతో కాంగ్రెస్వేవ్ను అడ్డుకునేందుకు స్వల్ప వ్యవధితోనే బీఆర్ఎస్కూడా అదే ప్రాంతాలలో రాజకీయ సభలు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నది. గడిచిన రెండు నెలలుగా రాష్ట్రంలో ఇదే కొనసాగుతున్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభలు, స్ట్రీట్కార్నర్మీటింగ్లు నిర్వహించిన కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ఆ ఏరియాలో సభ పెట్టి జనాలకు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నది.
కాంగ్రెస్‌వైపు జనాలు మళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. స్వయంగా కీలక మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లు కాంగ్రెస్వెనక బీఆర్ఎస్ సభలకు ప్లాన్చేయడం గమనార్హం. అధికార పార్టీగా ఉండి నష్టపోతామనే ఇండికేషన్‌తోనే ఆ ఇద్దరు మంత్రులు రాజకీయ సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది
పార్టీకి నష్టం జరగకుండా...?
గత నెల 24వ తేదిన కాంగ్రెస్‌పార్టీ ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి మయూరి సెంటర్ పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీసి జనాలను ఆకట్టుకున్నది. ఆ తర్వాత మయూరీ సెంటర్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ను ఏర్పాటు చేయగా, దాదాపు 50 వేల మందికి పైగా వచ్చినట్లు కాంగ్రెస్‌నేతలు ప్రచారం చేశారు.
దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ గ్రాఫ్పెరిగిందని గ్రహించిన బీఆర్ఎస్.. వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రత్యేక సభను నిర్వహించారు. కాంగ్రెస్‌పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఏప్రిల్ 26 కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో నిరుద్యోగ నిరసన ప్రదర్శన జరిగింది. కలెక్టరేట్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి, అంబేద్కర్ చౌరస్తా వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు.
ఇది జరిగిన ఒకటి రెండ్రోజుల్లో బీఆర్ఎస్పార్టీ ఇన్చార్జీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర సీనియర్నాయకుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక సభను ఏర్పాటు చేసి, కాంగ్రెస్‌ను డైవర్షన్చేసేందుకు ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 28న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్లగొండలో నిరుద్యోగ నిరసన ప్రదర్శన జరిగింది. నల్లగొండ క్లాక్ టవర్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఆధరణ పెరిగింది. దీన్ని గమనించిన ఆ జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి హై కమాండ్ ఆదేశాలతో సూర్యాపేట్, నల్లగొండ, మిర్యాలగూడలో బీఆర్ఎస్పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహించారు.
ఏప్రిల్ 30 మహబూబ్ నగర్లో కాంగ్రెస్‌పార్టీ నిరుద్యోగ నిరసన ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత వెంటనే మంత్రి కేటీఆర్ఈ నెల 6 మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్ప్రారంభోత్సవం చేసి రాజకీయ విమర్శలు చేశారు. ఈ సభలో మంత్రి శ్రీనివాస్గౌడ్టీపీసీసీ చీఫ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక వరంగల్, ఉమ్మడి మెదక్, కరీంనగర్ లో కాంగ్రెస్‌పార్టీ ర్యాలీలు, సభలు నిర్వహించిన అనంతరం మంత్రి హరీష్‌రావు, కేటీఆర్‌లు అభివృద్ధి పేరిట రాజకీయ ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీపై మౌనం..?
గత రెండేళ్ల నుంచి బీజేపీపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేసిన బీఆర్ఎస్రెండు నెలల నుంచి ఆ పార్టీని పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, సర్పంచ్ల నుంచి మంత్రుల వరకు కాంగ్రెస్పార్టీపైనే రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కేడర్బలోపేతం అవడంతో పాటు, కర్ణాటక రిజల్ట్స్‌తో బీఆర్ఎస్పార్టీలో కాస్త అలజడి మొదలైందని, అందుకే కాంగ్రెస్‌పైనే బీఆర్ఎస్ఎక్కువ ఫోకస్పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Read More... బిగ్ న్యూస్: స్పీడ్ పెంచిన T-బీజేపీ.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ‘‘మేనిఫెస్టో’’ కసరత్తు షురూ!