సోషల్ మీడియా యూజర్లకు పోలీసుల వార్నింగ్.. ఇకపై జైలు శిక్ష

సోషల్ మీడియాలో నీలి చిత్రాలు చూస్తున్న వారిపై పోలీసులు నిరంతరం సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నారు.

Update: 2024-09-29 05:58 GMT

దిశ, సిటీ క్రైమ్‌: సోషల్ మీడియాలో నీలి చిత్రాలు చూస్తున్న వారిపై పోలీసులు నిరంతరం సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే వారిపై నిఘా పెంచుతున్నారు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల వెనుక పోర్న్ వీడియోస్ ప్రభావం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఇప్పుడు అమెరికాలోని ఓ నిఘా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ సహాయంతో ఎవరెవరు సోషల్ మీడియాలో నీలి చిత్రాలు, వీడియోలు చూస్తున్నారు, వాటిని ఎవరికీ షేర్ చేస్తున్నారు... ఎంత సేపు చూస్తున్నారు వంటి విషయాలను నిత్యం గమనిస్తున్నారు. అలా చూస్తున్న వారి ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్, వారి లొకేషన్‌లను అమెరికా నిఘా సంస్థ క్రైం బ్యూరో రికార్డు ద్వారా స్థానిక పోలీసులకు పూర్తి సమాచారం పంపిస్తుంది. ఆ వివరాలతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఇలా చూసే వారి సంఘటనలల్లో సాంకేతిక ఆధారాలు పక్కాగా ఉంటాయి. కాబట్టి వారికి న్యాయ స్థానాల్లో భారతీయ న్యాయ సంహిత పొక్సో , ఐటీ చట్టాల కింద 5 సంవత్సరాల శిక్ష ఖాయమని సీపీ హెచ్చరించారు. మన పిల్లలను మానవ మృగాల నుంచి కాపాడుకుందాం, నేర రహిత సమాజంలో భాగస్వాములవుదాం అంటూ ఆదివారం రాచకొండ పోలీసులు ఓ అవగాహన వీడియోను విడుదల చేశారు.


Similar News