Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏకంగా ఆ రాష్ట్ర గవర్నర్ ఫోన్ ట్యాప్

తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో బిగ్ ట్విస్ట్ చేసుకుంది.

Update: 2025-01-25 05:25 GMT
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏకంగా ఆ రాష్ట్ర గవర్నర్ ఫోన్ ట్యాప్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. పోలీసుల విచారణలో భాగంగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా త్రిపుర (Tripura) గవర్నర్‌ నల్లు ఇంద్రాసేనా రెడ్డి (Governor Nallu Indrasena Reddy) ఫోన్‌ను ట్యాపింగ్ (Phone Tapping) చేసినట్లుగా ఎంక్వైరీ టీమ్ (Enquiry Team) గుర్తించింది. 2023 నవంబర్ నెలలో దాదాపు 15 రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా వెల్లడైంది. ఈ మేరకు ఇంద్రసేనా రెడ్డి (Indrasena Reddy) వ్యక్తిగత సహాయకుడిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఇంద్రాసేనా రెడ్డి 2023 అక్టోబర్ 26న త్రిపుర గవర్నర్ (Governor of Tripura) బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌‌కు గురైన వ్యవహారానికి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News