ఒక్కో ఫీల్డ్ వర్కర్‌కు రోజుకి 150 నుంచి 200 ఇండ్లు.. దోమలుంటే జరిమానే!!
దిశ, సిటీ బ్యూరో: మహానగరవాసులకు అందించాల్సిన అతి ముఖ్యమైన సేవల నుంచి జీహెచ్ఎంసీ తప్పుకుంటుందా? అంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి.
దిశ, సిటీ బ్యూరో: మహానగరవాసులకు అందించాల్సిన అతి ముఖ్యమైన సేవల నుంచి జీహెచ్ఎంసీ తప్పుకుంటుందా? అంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. దోమలను నివారించే బాధ్యతను నగరవాసులపైనే నెట్టేందుకు సిద్ధమవుతోంది. మహానగరంలో ఎక్కడైనా ఇంట్లో దోమలు వృద్ధి చెందినట్లు కనిపిస్తే, సదరు కుటుంబం నుంచి జరిమానా వసూలు చేయాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రజారోగ్య పరిరక్షణకా? లేక జరిమానాల రూపంలో ఖజానా నింపుకునేందుకా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోమల నివారణకు ప్రత్యేక విభాగమే ఉన్నా, బాధ్యతలను ఫీల్డ్ వర్కర్లపై నెట్టేందుకు సిద్ధమయ్యారు ఎంటమాలజీ విభాగం ఉన్నతాధికారులు. నిన్న మొన్నటి వరకు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేస్తూ, రొటీన్ విధులు నిర్వర్తిస్తున్న ఎంటమాలజీ ఫీల్డ్ వర్కర్లు ఇకపై రొటీన్ విధులతో పాటు డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తుదారుల వెరిఫికేషన్, ఇంటింటికీ దోమల నివారణపై అవగాహన, దోమల నివారణతో పాటు ప్రతి ఇంటినీ తనిఖీ చేసే బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దోమలు వృద్ధి చెందుతున్న ఇళ్లను గుర్తించి అవసరమైతే జరిమానా కూడా విధించాలని ప్రత్యేకంగా ప్రోఫార్మాను తయారు చేసి, ఫీల్ట్ వర్కర్లకు అందజేశారు. ఇప్పటికే దోమల నివారణ, ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ వంటి విభాగ సంబంధిత విధులతో పాటు విభాగానికి సంబంధం లేని విధులు కూడా నిర్వర్తిస్తున్న తాము రోజుకి 150 నుంచి 200 ఇళ్లలో దోమల అవగాహన, నివారణ చర్యలు చేపట్టలేమని ఫీల్డ్ వర్కర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఇం టికి అవగాహన కల్పించేందుకు కనీసం అరగంట పడుతుందని, 8 గంటల డ్యూటీలో 200 ఇళ్లను ఎలా తనిఖీ చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇక పాతబస్తీ వం టి ప్రాంతంలో మరీ కష్టం. ఎంతో పరిచయముంటే గానీ స్థానికులు తమ ఇళ్ల లోకి అనుమతించరు. కనీసం ఆస్తి పన్ను వసూలుకు కూడా ఇంటి ముందు అనుమతించని వారు ఇంటి మొత్తాన్ని తనిఖీ చేసి, దోమలుంటే జరిమానా విధించి, నివారణ చర్యలు చేపట్టేందుకు అనుమతిస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఉన్నతాధికారుల టార్గెట్ మేరకు ఇళ్లలో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా తలెత్తే అవకాశమున్నట్లు ఫీల్డ్ వర్కర్లు భ యాందోళనకు గురవుతున్నారు.
రమ్మన్నారు.. వెళ్లిపోయారు
దోమల నివారణ చర్యలు వంటి విధులతో పాటు డబుల్ బెడ్ రూం దరఖాస్తుల వెరిఫికేషన్, ఇంటింటికీ దోమల నివారణపై అవగాహన కార్యక్రమాలు, నిన్నమొన్నటి వరకు ఇంటింటికీ జెండాలు వంటి విధులు నిర్వహిస్తూ పని భారాన్ని మోస్తున్న తాము ప్రతి రోజు 150 నుంచి 200 ఇళ్లలో దోమల నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు వంటివి నిర్వహించలేమని కమిషనర్ లోకేశ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో చర్చించేందుకు రమ్మన్నారని ఎంటమాలజీ విభాగానికి చెందిన పలువురు ఫీల్డ్ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు. కానీ తాము టైమ్ వచ్చేకల్లా కమిషనర్ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని, పేషీలో వాకబు చేయగా, వినాయక నిమజ్జనం మీటింగ్ కు వెళ్లారని అక్కడి సిబ్బంది చెప్పినట్లు వారు వెల్లడించారు.
ట్యాక్స్ సిబ్బందికి నిర్బంధ టార్గెట్లు.. డిమాండ్‌కు తగ్గట్టు వసూలు చేయాల్సిందే