దిశ, డైనమిక్ బ్యూరో :రోజు రోజుకూ పెరగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకుండా రోడ్డెక్కడం వల్లే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసుల నివేదికల్లో వెళ్లడవుతోంది. ఈ క్రమంలో వాహనదారులందరికీ అవగాహన కలిగించేందుకు పోలీసులు, ఎన్జీవోలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అతివేగంతో వాహనం నడిపే సమయంలో ప్రమాదం జరిగినప్పుడు సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల జరిగే మేలును కలిగిస్తూ పోలీసులు వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే, తాజాగా హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తూ.. '' ట్రాఫిక్ పై ధ్యాస.. తెలంగాణ యాసలో కారెక్కినవా అన్నా.. సీట్ బెల్ట్ పెట్టుకోవాలె జూడు'' అని ట్వీట్ చేశారు.