బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో జనసేన పోటీపై పవన్ కల్యాణ్ క్లారిటీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. మరో వైపు రానున్న ఎన్నికల్లో సత్తా చాటి కింగ్ మేకర్‌గా నిలవాలని మిగిలిన పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ జనసేన నేతలు పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌ను అమరావతిలో కలిసి రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీపై చర్చించారు. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తోందని పవన్ కల్యాణ్ తెలంగాణ జనసేన నేతలకు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ జనసేన నేతలకు పవన్ సూచించారు.
అంతేకాకుండా త్వరలోనే వారాహి యాత్ర కూడా ఉంటుందని తెలిపారు. తెలంగాణలో జనసేన సత్తా చూపించేలా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. అలాగే, తెలంగాణలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన ఇన్ ఛార్జ్‌లను పవన్ నియమించారు. కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా ఉండగా.. జనసేన ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
Also Read..