పటాన్చెరు కాంగ్రెస్‌లో పంచాయతీకి ఫుల్స్టాప్
పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్పంచాయతీకి ఫుల్స్టాప్పెట్టేందుకు పీసీసీ సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్పంచాయతీకి ఫుల్స్టాప్పెట్టేందుకు పీసీసీ సిద్ధమైంది. ఇటీవల పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి కాటా శ్రీనివాస్గౌడ్మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈక్రమంలోనే రంగంలోకి దిగిన కాంగ్రెస్అధిష్టానం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు ఆ కమిటీ పటాన్చెరులో పర్యటించి, పూర్తి స్థాయి వివరాలను సేకరించింది. ఆపై ఇరువురిని గాంధీ భవన్‌కు రావాలని కమిటీ ఆదేశించింది. దీంతో రెండు రోజుల కిందట నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్గాంధీ భవన్‌కు వచ్చారు. అతని నుంచి కమిటీ అభిప్రాయాలను సేకరించింది. కాగా, మహిపాల్‌రెడ్డి తనకు రెండు రోజుల సమయం కావాలని కోరినట్లు తెలిసింది. ఇవాళ హైదరాబాద్‌కు వచ్చిన మహిపాల్‌రెడ్డి టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ వినోద్‌రెడ్డి ఇంట్లో ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పటాన్చెరులో నెలకొన్న పరిస్థితులను మహిపాల్‌రెడ్డి కమిటీకి వివరించినట్లు తెలిసింది. ఆయన నుంచి కమిటీ మరిన్ని అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. అయితే, పటాన్చెరు కాంగ్రెస్‌లోని ఇరువర్గీయుల మధ్య నెలకొన్న సమస్యను సమరస్యంగా పరిష్కరించి, వివాదానికి ఫుల్స్టాప్పెట్టాలని కమిటీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.