సీబీఎస్ఈ ఫలితాల్లో పల్లవి మోడల్ స్కూల్ 100 శాతం ఉత్తీర్ణత
ఈ నెల 12న విడుదలైన సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో బోడుప్పల్ లోని పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణతను సాధించారు.
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 12న విడుదలైన సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో బోడుప్పల్ లోని పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణతను సాధించారు. ఈ మేరకు పాఠశాల డైరెక్టర్ సుశీల్ కుమార్ , ప్రిన్సిపాల్ తనూజ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 98.6 శాతం ఉత్తీర్ణతతో బి.శ్రీ హర్ష స్కూల్ టాపర్ గా నిలిచాడు. 97.8 శాతం ఉత్తీర్ణతతో ఎ.అద్భుత్ సెకండ్ టాపర్ గా, 97.6 శాతం ఉత్తీర్ణతతో ఎం. హేమంత్ రాజ, కె.అభిజిత్ రెడ్డి థర్డ్ టాపర్లుగా నిలిచారు. గణితం, తెలుగు, సోషల్, ఏఐ సబ్జెక్టులలో పలువురు విద్యార్థులు 100/100 మార్కులు సాధించారు. పాఠశాలలోని విద్యార్థులలో 50% విద్యార్థులు 80% పైగా మార్కులను సాధించారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ అభినందనలు తెలియజేశారు.
Also Read..
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరు: మంత్రి హరీశ్ రావు