Palla Rajeshwar Reddy : గవర్నర్ ప్రసంగంపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.

Update: 2024-02-09 06:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం తీవ్ర నేరమన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఎవరికైనా రూ.10లక్షలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. 13 హామీలిచ్చి రెండు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహాలక్ష్మీ పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలన్నారు. ఫ్రీ బస్సు కారణంగా ఆరున్నర లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఉపాధి లేక 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు. ఈఎంఐలు కట్టలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. మీరు చెప్పిన ఆరు గ్యారంటీల్లో 13 అంశాలున్నాయన్నారు. నిర్దిష్ట గడువు చెప్పిన గ్యాంరటీలు అమలు చేయాలనే మేం అడుగుతున్నాం అన్నారు. సీఎం చెప్పినా.. గడువు తీరిన హామీలు అమలు చేయనందునే ప్రశ్నిస్తున్నామన్నారు.

Tags:    

Similar News