Hyderabad Metro : నాగోల్ మెట్రో స్టేషన్‌లో పెయిడ్ పార్కింగ్

నాగోల్ మెట్రో స్టేషన్‌లో అధికారులు పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేశారు.

Update: 2024-08-14 06:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నాగోల్ మెట్రో స్టేషన్‌లో అధికారులు పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి, మెట్రో అధికారులు తాజాగా ధరలను నిర్ణయించారు. బైక్‌కు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10, 8 గంటల వరకు రూ.25 రూపాయలు వసూలు చేయనున్నారు. 12 గంటల వరకు రూ.40 రూపాయల ఫీజు కట్టాలని సూచించారు.

అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30, 8 గంటల వరకు రూ.75, 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలు నిర్ణయించారు. కాగా, నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్  .. మియాపూర్ తరహాలోనే నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీతో పాటు పెయిడ్ పార్కింగ్ రెండు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..