సీఎం రేవంత్‌కు తెలంగాణ విద్యావేత్తల బహిరంగ లేఖ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి తెలంగాణ విద్యావేత్తలు(Telangana educationists) బహిరంగ లేఖ రాశారు.
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి తెలంగాణ విద్యావేత్తలు(Telangana educationists) బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ విద్యావంతుల ఆలోచనలు, విద్యార్థుల ఆకాంక్షలు, ప్రజా ఉద్యమ ఫలితలంగా ఏర్పడిన తెలంగాణలో విద్యారంగం ఆశించిన ఫలితాలు సాధించలేదు. కారణాలు ఏమయినప్పటికీ గడిచిన పదేళ్లలో ప్రజల ఆకాంక్షల మేరకు ఉన్నత విద్యా వ్యవస్థలో పురోగతి కనిపించలేదు. మీరు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్న కొన్ని చర్యలు, విధాన నిర్ణయాలు విద్యారంగ పటిష్టతకు తోడ్పడతాయని ఆశిస్తున్నాం. అదే సమయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Dr. BR Ambedkar Open University)లో ఏర్పడిన సంక్షోభాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఈ లేఖ రాస్తున్నాం.
జూబ్లీహిల్స్‌లో ఉన్న అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన స్థలంలో నుంచి పదెకరాలు జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వ విద్యాలయానికి కేటాయిస్తూ తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సెప్టెంబర్ 19వ తేదీన ఒక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం రెండు విశ్వ విద్యాలయాల రిజిస్ట్రార్‌లకు లేఖ రాసిన విషయం మా దృష్టికి వచ్చింది. ఇది మమ్మల్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆ విశ్వవిద్యాలయం ఆవర్భావ నేపథ్యం, మన సమాజం మీద ఆ సంస్థ ప్రభావం తెలిసిన వారీగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం తమ బాధ్యతగా భావిస్తున్నాం’ అని మొత్తం నాలుగు పేజీల లేఖను సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ విద్యావేత్తల బహిరంగ లేఖ రూపంలో రాశారు.