ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
రాచకొండ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 20 లక్షల నగదు, బ్యాంక్ అకౌంట్ లలో ఉన్న కోటీ 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : రాచకొండ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 20 లక్షల నగదు, బ్యాంక్ అకౌంట్ లలో ఉన్న కోటీ 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం రాత్రి ఎల్బీ నగర్ ఎస్ఓటీ సిబ్బంది చైతన్యపురి పోలీసులతో కలిసి బెట్టింగులు నిర్వహిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు. పూర్తి వివరాలను కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఈ రోజు సాయంత్రం వెల్లడిస్తారు.