TG Police: ఒక్క క్లిక్ మీ జీవితాన్ని మార్చేస్తుంది.. తెలంగాణ పోలీస్ ఆసక్తికర పోస్ట్

ఆన్‌లైన్‌ మోసాలు రోజు రోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. చిన్నపాటి మీ పొరపాటుతో చాలా మంది ఖాతాల్లో డబ్బులు మాయం అవుతున్నాయి.

Update: 2025-01-20 06:43 GMT
TG Police: ఒక్క క్లిక్ మీ జీవితాన్ని మార్చేస్తుంది.. తెలంగాణ పోలీస్ ఆసక్తికర పోస్ట్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్‌లైన్‌ మోసాలు (Cyber Frauds) రోజు రోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. చిన్నపాటి మీ పొరపాటుతో చాలా మంది ఖాతాల్లో డబ్బులు మాయం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా అవగాహన కల్పిస్తూ (Telangana Police) తెలంగాణ పోలీస్ అధికారిక ఖాతా ఎక్స్ వేదికగా సోమవారం ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఒక్క క్లిక్ మీ జీవితాన్ని మార్చేస్తుందని సూచించింది. తక్కువ ధరకే వస్తువులు అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మకండని తెలిపింది. అత్యాశతో వెనుకా ముందు ఆలోచించకుండా లింక్ క్లిక్ చేయవద్దని సూచనలు చేసింది. మీ అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడని, తక్కువ ధరకు వస్తువులు అంటే.. అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించాలని తెలిపింది. సైబర్ నేరాలపై అవగాహానే మీకు రక్ష అంటూ వెల్లడించింది.

Tags:    

Similar News