అర్ధరాత్రి మేడారం ఆలయ శుద్ధి.. అమ్మవారి ప్రతిష్టాపన
కొరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లీ సారలమ్మ తల్లీ కన్నెపల్లి నుండి బయలుదేరి మేడారం సమీప అలయా సమీప ప్రాంతానికి చేరుకుంది.
దిశ, మేడారం బృందం: కొరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లీ సారలమ్మ తల్లీ కన్నెపల్లి నుండి బయలుదేరి మేడారం సమీప అలయా సమీప ప్రాంతానికి చేరుకుంది. అయితే కాసేపట్లో గద్దెలపై వనదేవత సారాలమ్మ అగమనం ఉండగా దేవాదాయ శాఖ అద్వర్యంలో అమ్మవారి అగమనం కోసం పకడ్బంది ఏర్పాటు చేశారు. ముందుగా అలయా ప్రాంగణంలోని భక్తుల నుండి ఏలాంటి ఇబ్బందుల తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అలయం నుండి బయటి పంపించీ అలయాన్ని మొత్తం నీటితో శుద్ది చేశారు. అంతే కాకుండా అమ్మవార్ల గద్దెలను కూడా పూజారుల సూచనల మేరకు శుద్ది చేశారు. అయితే సారలమ్మ గద్దెకు చేరే సమయంలో అలయంలోకి ఏవరిని ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు నిర్వహించారు. అయితే అమ్మవారి దర్శన బాగ్యం కోసం ఏదురు చూస్తున్న భక్తులతో అలయా చుట్టు ప్రాంతం మొత్తం భక్తులతో, సారలమ్మ నామ స్మరణతో హోరెత్తి పోతుంది.