కౌన్సిల్ మీటింగ్‌ను బాయ్ కాట్ చేసిన అధికారులు.. GHMC చరిత్రలోనే తొలిసారిగా..
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. బుధవారం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కాసేపటికే విపక్ష కార్పొరేటర్లు నిరసన చేపట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. బుధవారం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కాసేపటికే విపక్ష కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. మేయర్ చైర్ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో తీవ్ర రసాభాస నెలకొంది. మేయర్ విజయలక్ష్మి వారించినప్పటికీ విపక్ష కార్పొరేటర్లు వెనక్కి తగ్గకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రభుత్వ అధికారులు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. విపక్ష కార్పొరేటర్ల తీరుకు నిరసనగా వాటర్ బోర్డు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు సమావేశం నుండి వాకౌట్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అధికారుల బాయ్‌కాట్‌తో మేయర్ విజయలక్ష్మి సమావేశాన్ని ముగించారు. అయితే, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ సమావేశాలను విపక్ష కార్పొరేటర్లు బాయ్ కాట్ చేశారు కానీ.. తొలిసారిగా జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా అధికారులు సమావేశాన్ని బాయ్ కాట్ చేసి కొత్త చరిత్ర సృష్టించారు.