ఓబీసీ ఇష్యూ.. అదాని అంశాన్ని డైవర్ట్ చేసేందుకే.. : వీహెచ్

రాహుల్ గాంధీ‌పై బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్ కొత్త ఆరోపణలు చేస్తున్నారు.

Update: 2023-03-29 08:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీ‌పై బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్ కొత్త ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఓబీసీలను కించ పరుస్తూ మాట్లాడాడని రాహుల్ గాంధీ ఓబీసీలకు క్షమపణలు చెప్పాలని కొత్త వాదన వినిపిస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు క్షమాపణలు చెప్పాలని ఫైర్ అయ్యారు. అదాని‌పై పార్లమెంట్‌లో ప్రశ్నించినందుకా? అన్నారు. అదాని విషయంపై ప్రజల దృష్టి మరల్చడానికే ఓబీసీల అంశాన్ని తెర మీదకు తెచ్చారన్నారు. ఏప్రిల్ 1న అన్ని పార్టీలతో సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. రాహుల్ గాంధీ ఓబీసీలను ఎక్కడ కించ పరిచారు అనే విషయంపై చర్చిస్తామన్నారు.

ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఎం చేశాయి.. ఇప్పుడు తొమ్మిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఎం చేసింది అనే విషయంపై రౌండ్ టేబుల్ సమాశంలో చర్చిస్తామన్నారు. అదాని గురించి మాట్లాడితే ఓబిసి అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజల దృష్టి మరల్చడానికీ బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయలకు బీజేపీ ఓబీసి అంశాన్ని వాడుకుంటుందన్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు తో సహా ఓబీసీ విద్యార్థులు మేధావులు పాల్గొనాలన్నారు. వయనాడ్ ఎన్నికలకు 30 రోజుల గడువును ఇస్తూ సీఈసి నిర్ణయం తీసుకుందన్నారు. సీఈసికి ఉన్న ఆలోచనా పార్లమెంట్‌లో స్పీకర్‌కు లేదని తేలిపోయిందన్నారు. స్పీకర్ బీజేపీ పార్టీకి తోత్తుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. 

Tags:    

Similar News