హస్గుల్ లో కుస్తీమే సవాల్
బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలో మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ శివారులోని మత్తడి పోచమ్మ తల్లి ఆలయం వద్ద గ్రామ పెద్దలు కుస్తీ పోటీలు నిర్వహించారు.
దిశ, బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలో మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ శివారులోని మత్తడి పోచమ్మ తల్లి ఆలయం వద్ద గ్రామ పెద్దలు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుస్తీ పోటీలను తిలకించేందుకు ఆయా గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకాగా ఈ పోటీలలో తలపడేందుకు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సైతం మల్లయోధులు తరలివచ్చారు.
చివరి కుస్తీ పోటీలో విజేతగా నిలిచిన మల్ల యోధున్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగల శంకర్ అభినందించడమే కాకుండా నగదు బహుమతితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజు పటేల్,గోపాల్ రెడ్డి, మునీర్, నారాయణ, నాగనాథ్ పటేల్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కుస్తీ పోటీలను విజయవంతం చేశారు.