కార్మికుల జీతాల కోసం అష్టకష్టాలు పడుతున్న కార్యదర్శులు

రాష్ట్రంలో నేడు గ్రామ పంచాయతీల పరిస్థితి అద్వానంగా మారాయనే చెప్పవచ్చు. గత కొద్ది నెలలుగా 15వ ఫైనాన్స్, ఎస్ ఎస్ సి నిధులు రాకపోవడంతో ఉమ్మడి కోటగిరి మండలం లో గ్రామ పంచాయతీలు పరిస్థితి ఇబ్బందికరంగా మారి అప్పులు పాలవుతున్నాయి.

Update: 2024-06-01 04:36 GMT

దిశ, కోటగిరి : రాష్ట్రంలో నేడు గ్రామ పంచాయతీల పరిస్థితి అద్వానంగా మారాయనే చెప్పవచ్చు. గత కొద్ది నెలలుగా 15వ ఫైనాన్స్, ఎస్ ఎస్ సి నిధులు రాకపోవడంతో ఉమ్మడి కోటగిరి మండలం లో గ్రామ పంచాయతీలు పరిస్థితి ఇబ్బందికరంగా మారి అప్పులు పాలవుతున్నాయి. జనవరి నాటికి సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ప్రత్యేక అధికారుల పాలనలో నిధుల కొరతతో పచ్చని పల్లెల్లో పరిశుద్ధ పనులు సైతం నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. పనులైతే కావాలే కానీ పైసల్ లేవాయే అన్న చందంగా ప్రస్తుతం గ్రామ పంచాయతీలా పరిస్థితి నెలకొంది.

అప్పుల కుప్పగా గ్రామ పంచాయతీలు..

గత కొద్ది నెలలుగా గ్రామ పంచాయతీ నిధులు రాకపోయినప్పటికీ సర్పంచులు తమ పదవి కాలంలో తమ పరువును నిలుపుకోవడం కోసం జేబులో నుంచి డబ్బులు పెట్టి గ్రామ పంచాయతీ ఖర్చులు సిబ్బంది, కార్మికుల జీతాలు చెల్లించారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు లేక బిల్లులు రాకపోవడంతో పాటు పూర్తి స్థాయి పన్నులు వసూళ్లు కాకపోవడంతో సిబ్బంది, కార్మికులు జీతాలు చెల్లించడం కోసం మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేసి మరి జీతాలు చెల్లించాగా చిన్న చిన్న గ్రామ పంచాయతీలో నిధులు లేక రెండు మూడు నెలలుగా సిబ్బందికి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

చిన్న ప్రాణం - పెద్ద పనులు..

కక్కలేక మింగలేక పరిస్థితుల గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మండలంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు చాలీచాలని జీతాలతో మరికొంతమంది అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు గత ఎనిమిది నెలలుగా అటు జీతాలు రాక కుటుంబం భారలు మోస్తూనే.. ఇటు నిధులు లేకున్నా గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్‌ల కోసం చిన్న ప్రాణాలకు పెద్ద పనులు అనే విధంగా అష్టకష్టాలు పడుతున్నారు.

సకాలంలో నిధులు మంజూరు చేయాలి - ఎంపీఓ మారుతి

ప్రభుత్వం వెంటనే కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న నిధులను సకాలంలో చెల్లిస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు సజావుగా సాగుతాయని కావున ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.


Similar News