ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు
ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడవ రోజు విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధనకై చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
దిశ, కామారెడ్డి : ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడవ రోజు విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధనకై చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యంగా దీక్షను భగ్నం చేయించి.. డీఎస్పీ నాయకులను అరెస్ట్ చేశారని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇవ్వకుండా మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే..ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. రానున్న రోజుల్లో ఈ పోరాటాలను కొనసాగిస్తామన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అరెస్ట్ చేసినా,తమ లక్ష్యాన్ని, ఆశయాన్ని ఆపలేరన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, జిల్లా కన్వీనర్ బోలేశ్వర్, జిల్లా నాయకులు రాజు, సత్యం, రాజు, కవిన్, రాజశేఖర్, రాజు, శివరామకృష్ణతో పాటు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.