అంతర్ రాష్ట్ర దొంగల ముఠాతో రైతన్న జెర భద్రం...!
కామారెడ్డి జిల్లాలో వరుసగా జరుగుతున్న ట్రాన్సపార్మర్ ల అంతర్ రాష్ట్రదొంగల ముఠాతో రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా పండించిన పంటకు కాపు కాసేకంటే బోరు బావుల దగ్గర ఉన్న ట్రాన్సపార్మర్లకు కాపలా కాయాలిస్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లాలో వరుసగా జరుగుతున్న ట్రాన్సపార్మర్ ల అంతర్ రాష్ట్రదొంగల ముఠాతో రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా పండించిన పంటకు కాపు కాసేకంటే బోరు బావుల దగ్గర ఉన్న ట్రాన్సపార్మర్లకు కాపలా కాయాలిస్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిసర ప్రాంతాలలో గత 20 రోజులుగా 17 ట్రాన్సపార్మర్ల దొంగతనాలు జరుగుతుండడంతో వారిని పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.
దొంగలను పట్టుకోవడానికి పోలీస్ బృందం ముమ్మర గాలింపు చేపడుతున్నామని అన్నారు. ఇదే విషయమై తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాలల్లో, పంటపొలాల చుట్టూ గుర్తుతేలియని వ్యక్తులు సంచరిస్తే వెంటనే 100 నంబర్ కి లేదా తాడ్వాయి ఎస్సై 8712686166 గల నంబర్ కి తెలుపలని అలాగే బోరుబావుల దెగ్గర ప్రత్యేక నిఘాపెట్టాలని ఎస్సై ఆంజనేయులు రైతులకు సూచిస్తున్నారు.