రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తుంది.. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.

Update: 2023-06-21 11:43 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా డిచ్ పల్లి మండలం ధర్మారం హైవే పై ఉన్న క్యాథలిక్ చర్చిలో, నడిపల్లి గ్రామంలో ఉన్న సీఎస్ఐ చర్చి రెండు చర్చిలో ప్రార్థనలకు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా పాల్గొన్నారు. అనంతరం ఏసుక్రీస్తు ప్రభువులకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతు ధర్మారం గ్రామానికి రూ. 4 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామన్నారు. నడిపల్లి నుండి మాధవ్ నగర్ వరకు కోట్ల రూపాయలతో సెంటర్ లైటింగ్ నిర్మించుకున్నారని తెలిపారు. క్రిస్మస్‌ పండగకు క్రైస్తవులకు ప్రేమవిందు ఏర్పాటు చేస్తున్నారని, కానుకలు పంపిణీ చేస్తున్నారని వివరించారు.

క్రైస్తవుల కోసం హైదరాబాద్‌లో క్రైస్తవ సంక్షేమ భవనాన్ని నిర్మించేందుకు ఇటీవలే శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. ఈ ఒక్క మతస్తులకే కాదు, హిందువులకు, ముస్లింలకు కూడా, పండగలకు కానుకలు ఇస్తూ తేనేటి విందులు ఇస్తూ అన్ని కులాలకు సముచితన్యాయం కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. కానీ కొంతమంది బీజేపీ నాయకులు, మతాన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా శ్రీరాముని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేస్తున్నారన్నారు. హిందువుల మై ఉండి, దేశాన్ని పాలించే ముగ్గురు, ప్రధాని, దేశ హోంశాఖ, దేశ రాష్ట్రపతి, ముగ్గురు హిందువులే మరి ఎందుకు దేశం ప్రమాదంలో ఉందనటం సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ చెప్పే అబద్ధాలను నమ్ముతున్న యువకులు మేలుకోవాలన్నారు.

మన దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ రూ. 100 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. అప్పు చేసి మరి ఏ గ్రామానికి అయినా రూపాయి ఇచ్చిండా అంటే అది లేదు, అబద్ధ ప్రచారాలు చేసుకోవడం మతాన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా రామున్ని అడ్డం పెట్టుకొని, రావణాసుడులా రాజకీయం చేస్తున్నా బిజెపి పార్టీ, యువతను తప్పుదోవ పట్టిస్తూ మత రాజకీయం చేయడం తప్ప ప్రజలకు చేసింది శూన్యం అని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాడు. వారి దగ్గర ఉన్న వ్యక్తులు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి ప్రభుత్వానికి ఎగబెట్టి వేరే దేశానికి పారిపోయారన్నారు. ఇలాంటి దుర్మార్గులకు ఇలాంటి బీజేపీ పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలి అని అన్నారు.

Tags:    

Similar News