రైతులకు విత్తనాలు అందించడంలో జాప్యం జరిగితే కఠిన చర్యలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల

Update: 2024-05-31 14:10 GMT

దిశ, తల్లాడ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించే పిల్లి పెసలు, జిలుగులు, జనుములు, పచ్చిరొట్ట విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతుకు అందే విధంగా కృషి చేయాలని అలాగే విత్తనాల పంపిణీ లో ఎలాంటి జాప్యం జరిగిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత రెండు రోజుల క్రితం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమంలో రైతులకు విత్తనాలు అందలేదని ఫిర్యాదు పై జెడి సమగ్రంగా విచారణ చేపట్టారు.

జిల్లాలో ఉన్న వ్యవసాయ రైతులందరికీ పచ్చిరొట్ట విత్తనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సహకార సంఘాల ద్వారా పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసేందుకు అన్ని సహకార సంఘాలకు విత్తనాలను సరఫరా చేయడం జరిగిందని అన్నారు. ప్రతి రైతుకు తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్ చేసి సహకార సంఘాల ఆధ్వర్యంలో విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ చేసిన ప్రతి రైతుకు విత్తనాలు అందించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ధరలకే విత్తనాలను అమ్మాలని కోరారు.

ఖమ్మం జిల్లాలో పత్తి సాగు కోసం 5.60 లక్షల పత్తి విత్తనాలు తేప్పించాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటివరకు 4 .50 లక్షల పత్తి విత్తనాలు ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అదనంగా 1.60 లక్షల ప్యాకెట్ల సిద్ధం చేస్తున్నామని అన్నారు. రైతులు ఒకే రకమైన కంపెనీ విత్తనాల కోసం పోటీ పడవద్దని అందుబాటులో ఉన్న వివిధ రకాల విత్తనాలు వినియోగించుకోవాలని. విత్తనాలను ఎక్కడపడితే అక్కడ కాకుండా లైసెన్సులు కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలన్నారు.

విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు బిల్లులు తీసుకొని పంట దిగుబడి చేతికి వచ్చేవరకు భద్రపరచుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అంతేకాకుండా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుందని నిత్యం టాక్స్ ఫోర్స్ తదితర బృందాలతో మెగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం అసిస్టెంట్ రిజిస్టర్ పాషా,సందీప్ వ్యవసాయ శాఖ ఏడి నరసరావు,ఏవో తాజుద్దీన్, సహకార సంఘం సీఈవో నాగబాబు, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News