ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలి

సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు.

Update: 2024-08-09 10:34 GMT

దిశ, కామారెడ్డి : సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ని ప్రారంభించిన తర్వాత పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీసులతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు బాగున్నాయని, ఇలాగే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ

    మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలతో నిత్యం రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం సిబ్బంది సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసిన పట్టణ సీఐ చంద్ర శేఖర్ రెడ్డిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పి నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్, టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ సీఐ తిరుపతయ్య, పోలీస్ సిబ్బంది, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News