మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో మేలు : జహీరాబాద్ ఎంపీ

మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో మేలు అని ఎంపీ సురేష్ షెట్కార్

Update: 2025-01-14 08:04 GMT
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో మేలు : జహీరాబాద్ ఎంపీ
  • whatsapp icon

దిశ, పిట్లం : మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో మేలు అని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. మంగళవారం నాడు పిట్లం మండల కేంద్రంలో వివేకానంద పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ..క్రీడలు మనిషికి ఎంతో మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఆయన అన్నారు. క్రీడా పోటీలను పోటీ స్ఫూర్తితో ఆడాలని క్రీడల్లో గెలుపు ఓటమి సమానమని ఆయన అన్నారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా రూ.51వేల, రెండవ బహుమతిగా 25 వేల రూపాయలతో పాటు రోపిని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్న వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ ఏనుగండ్ల శ్రీనివాస్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు సూరత్ రెడ్డి, కుమ్మరి శేఖర్, నజీర్ సెట్, క్రీడాకారులు పాల్గొన్నారు.


Similar News