కుక్కల వేట కోసం ప్రత్యేక బృందాలు

నిజామాబాద్ నగరంలో వీధి కుక్కల బెడదను నివారించడానికి కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Update: 2024-11-10 11:43 GMT

దిశ ప్రతినిధి నిజామాబాద్ నవంబర్ 10 : నిజామాబాద్ నగరంలో వీధి కుక్కల బెడదను నివారించడానికి కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కుక్కలకు కు.ని.ఆపరేషన్లు చేసే యూనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నగరంలో అక్కడక్కడ వీధికుక్కలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కుక్కలను పట్టి బంధించాలని,తద్వారా నగర ప్రజలకు కుక్కలతో ప్రమాదాలు కలగకుండా చూడాలని కమిషనర్ దిలీప్ కుమార్ అధికారులను ఆదేశించారు.కమిషనర్‌ వెంట మేనేజర్‌ జనార్ధన్‌, సోల్మన్‌రాజు, పలువురు ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు


Similar News