అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు షోకాజ్ నోటీస్

నిజామాబాద్ పట్టణంలోని స్థానిక ఖలీల్వాడిలో గల అయ్యప్ప స్కానింగ్ సెంటర్, ఐ హాస్పిటల్ లో గత నెలలో జరిగిన స్కానింగ్ సెంటర్లో అశ్లీల కార్యకలాపాలు, రాసలీలలు, స్కానింగ్ కోసం వచ్చిన అమాయక మహిళలను మోసం చేయడం లాంటి సంఘటనలు మీడియాలో వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించారు.

Update: 2024-05-28 15:17 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ పట్టణంలోని స్థానిక ఖలీల్వాడిలో గల అయ్యప్ప స్కానింగ్ సెంటర్, ఐ హాస్పిటల్ లో గత నెలలో జరిగిన స్కానింగ్ సెంటర్లో అశ్లీల కార్యకలాపాలు, రాసలీలలు, స్కానింగ్ కోసం వచ్చిన అమాయక మహిళలను మోసం చేయడం లాంటి సంఘటనలు మీడియాలో వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆధ్వర్యంలో జిల్లా బృందం ఆకస్మికంగా తనిఖీ చేసి అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు అందించారు. నలుగురు వైద్య నిపుణుల చేత ఒక కమిటీని వేశారని, ఈ కమిటీ త్వరితగతిన స్పందించి ఏడు రోజులలో వారి రిపోర్ట్ ని సబ్మిట్ చేయాల్సిందిగా కోరారు. వారిచ్చిన రిపోర్టుని కలెక్టర్ కి సమర్పించడం జరుగుతుందని, తదుపరి చర్యలు తీసుకుంటారన్నారు.  


Similar News