Additional Collector : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తో పాటు, డీఆర్డీఓ సాయ గౌడ్, అదనపు ఎస్పీ బస్వారెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉన్నతాధికారులకు రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు..
రక్షాబంధన్ వేడుకను పురస్కరించుకుని కలెక్టరేట్ లోని వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు సోమవారం ఉన్నతాధికారులకు రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం కలెక్టరేట్ కు వచ్చి అధికారులకు రాఖీలు కట్టారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితర అధికారులకు రాఖీలు కట్టి, రక్షా బంధన్ ప్రాశస్త్యాన్ని చాటారు.