నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం.. ఏకంగా ఈవోనే! (వీడియో)
నిజామాబాద్ జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. రథసప్తమి అనంతరం పూజారులు కొలనులో విగ్రహాలకు అభిషేకం చేశారు. అయితే, అభిషేకం జరుగుతుండగానే పుష్కరిణిలో ఈవో వేణు ఈతకొట్టారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. రథసప్తమి అనంతరం పూజారులు కొలనులో విగ్రహాలకు అభిషేకం చేశారు. అయితే, అభిషేకం జరుగుతుండగానే పుష్కరిణిలో ఈవో వేణు ఈతకొట్టారు. ఈవో వేణు ఈతకొట్టిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వైపు కొలనులో విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా మరోవైపు వేణు ఈతకొట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం ఈవో వేణుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడికి అభిషేకం చేస్తుండగా ఈవో స్నానం ఆచారించాల్సిన అవసరమా? అని మండిపడుతున్నారు.
నిజామాబాద్ - నీలకంఠేశ్వర ఆలయంలో విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా పుష్కరిణిలో ఈత కొట్టిన ఈవో వేణు#Nizamabad pic.twitter.com/7ajIzwWjdq
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2023