Narayankhed MLA : చెరుకు సాగులో మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి..
చెరుకు సాగులో రైతులు మెళుకువలు పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని
దిశ,నిజాంసాగర్: చెరుకు సాగులో రైతులు మెళుకువలు పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. ఆయన గురువారం నిజాంసాగర్ మండలంలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ప్రాంత పరిధిలో చెరుకు అభివృద్ధి సీడీసీ చైర్మన్ గా ఎండీ. షాదుల్లా ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిడీసీ చైర్మన్ శాదుల్లా మాట్లాడుతూ..చెరుకు రైతులు అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. చెరుకు పంట విస్తీర్ణం పెంచే విధంగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం నారాయణ ఖేడ్ సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. చెరుకు సాగు నారాయణ ఖేడ్ పరిధిలో ఎక్కువగా పండుతుందని అన్నారు. రైతులు చెరుకు సాగుకు అనువైన మెళకువలు పాటించి అధిక దిగుబడితో లబ్ధి పొందాలని కోరారు.
ప్రస్తుతం ఒక ఎకరానికి 80 టన్నుల చెరుకు పంట వచ్చే విధంగా కృషి చేయాలని రైతులను కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెరుకు విత్తనాలు,ఎరువులుకు అందజేయాలని సూచించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరిట తీసుకున్న రుణం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు రుణ మాఫీ కి ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరిట తీసుకున్న లోన్ రైతులకు నష్టం కల్గించేటట్లు ఉంటే ఊరుకునేది లేదని అన్నారు. జుక్కల్,నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని చెరుకు రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా చెరుకు పంట తరలించేందుకు రోడ్లు సమస్య ఉంటే నిధులు విడుదల చేసి మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు.
చెరుకు రైతుల అభివృద్ధికి సహకరించాలి : ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్
చెరుకు రైతుల అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. సిడిసి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన షాదుల్లా ను శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..చెరుకు పంట నారాయణ ఖేడ్ ప్రాంతంలో ఎక్కువగా పండుతుందనీ రైతులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఫ్యాక్టరీ యాజమాన్యం ను కోరారు. అనంతరం ఫ్యాక్టరీ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
రైతుల పేరిట తీసుకున్న లోన్ మాఫీ బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యానిదే : గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావు.
గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరిట తీసుకున్న లోన్ పూర్తిగా యాజమాన్యమే భరిస్తుందని హామీనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు రుణ మాఫికి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి చీకోటి జయ ప్రదీప్,గాయత్రి ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు,కేన్ జనరల్ మేనేజర్ వెంగళ్ రెడ్డి,ఎండి. ఫారూఖ్,ప్రజా పండరి,బొజ్జ అంజయ్య,మేంగారం పండరి, మోహన్ రెడ్డి,నరసింహ రెడ్డి,రఘునాథ్,తదితరులు రైతులు పాల్గొన్నారు.