ఇంగ్లీష్ భాష పై పట్టుతోనే ఏ రంగంలోనైనా విజయం..

విద్యార్థులు పలుభాషల పై ప్రత్యేకంగా ఇంగ్లీష్ బాష పై పట్టుసాధించటం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలోనైన విజయం సాధించటానికి అవకాశాలు మెండుగా ఉంటాయని శ్రీ సూర్యోదయ హై స్కూల్ కరెస్పాండెంట్ నాగరావు పేర్కొన్నారు.

Update: 2023-04-04 13:10 GMT

దిశ, నందిపేట్ : విద్యార్థులు పలుభాషల పై ప్రత్యేకంగా ఇంగ్లీష్ భాష పై పట్టుసాధించటం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలోనైన విజయం సాధించటానికి అవకాశాలు మెండుగా ఉంటాయని శ్రీ సూర్యోదయ హై స్కూల్ కరెస్పాండెంట్ నాగరావు పేర్కొన్నారు. మంగళవారం నందిపేట్ లో గల సూర్యోదయ స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ ఈవెంట్ కార్యక్రమానికి తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో వచ్చారు. విద్యార్థులు తమ కార్యక్రమాలను ఇంగ్లీష్ భాషలో వివరించిన తీరును పలువురు ఆభినందించారు.

ఈ సందర్బంగా కరెస్పాండెంట్ నాగరావు మాట్లాడుతూ కరోనామహమ్మరి కారణంగా విద్యార్థులు గత మూడు సంవత్సరాలుగా చదువులో వెనుకబడినందుకు వారి భవిష్యత్తు కొరకు హైస్కూల్‌లో ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాస్‌లను ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అయిన జూన్ నెల నుండి బోధిస్తున్నామని తెలిపారు. హైదరబాద్ నుండి ఇంగ్లీష్ నైపుణ్యం ఉపాధ్యాలు వచ్చి బోధించి వెళ్తున్నారని వివరించారు.

ప్రపంచ భాష ఇంగ్లీష్..

ఇంగ్లీష్‌ ను ప్రపంచ భాషగా అభివర్ణిస్తూ ప్రతిఒక్కరూ ఇంగ్లీష్‌ నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. స్థానిక భాష తెలుగు, జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఆంగ్లంపై పట్టు సాధించటం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చునన్నారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో ముల్టినేసనల్ కంపెనీలు వస్తున్నాయి, అటువంటి కంపెనీలలో మంచి ఉద్యోగం సాధించాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉండాలి కాబట్టి విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొనే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.

Tags:    

Similar News