నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది.

Update: 2024-10-16 12:53 GMT

దిశ,నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 8 క్రస్ట్‌ గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు1,08782 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అంతే మొత్తం కిందికి వెళ్తున్నది. జలాశయం ఇన్ ఫ్లో : 108782 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 108782 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉంది.


Similar News