MLA Paidi Rakesh Reddy : ఉస్మానియా నుండే ఉద్యోగాల కోసం ఉద్యమం..

తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రారంభం అయి.. అటు తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, ఇప్పుడు నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం మళ్లీ ఓయూ నుండి ఉద్యమం చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-18 12:43 GMT

దిశ, ఆర్మూర్ : తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రారంభం అయి.. అటు తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, ఇప్పుడు నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం మళ్లీ ఓయూ నుండి ఉద్యమం చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన నిరుద్యోగ విద్యార్థి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిరుద్యోగ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడ వద్దన్నారు. మెగా డీఎస్సీ, గ్రూప్ ఉద్యోగాలు పెంచి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలన్నారు.

చదువుకునే విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వేల కోట్ల బడ్జెట్ విద్య పై పెట్టిన కింది స్థాయిలో అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం మాత్రమే నిధులు వెచ్చిస్తుందని, యువతకి ఉపాధి చూపే బాధ్యత రాష్ట్రప్రభుత్వం తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనతోనే ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిరుద్యోగ యువతి, యువకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News