రైతు సమస్యల పై అసెంబ్లీలో మాట్లాడాలి.. ఎమ్మెల్యేకు వినతి..

అసెంబ్లీలో రైతు సమస్యల పై మాట్లాడాలని కోరుతూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.

Update: 2024-12-14 07:31 GMT

దిశ, కామారెడ్డి : అసెంబ్లీలో రైతు సమస్యల పై మాట్లాడాలని కోరుతూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాతో పాటు వివిధ సమస్యల పై అసెంబ్లీలో చర్చించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పైడి విఠల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనంద్ రావు, జోనల్ అధ్యక్షులు లొంక వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News