డయల్ 100ను మిస్ యూస్ చేసిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష

ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ 100 కు ఫోన్ చేసి మిస్ యూస్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న ఆర్మూర్ పట్టణంలోని అశోక్

Update: 2025-04-04 14:40 GMT
డయల్ 100ను మిస్ యూస్ చేసిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష
  • whatsapp icon

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ 100 కు ఫోన్ చేసి మిస్ యూస్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న ఆర్మూర్ పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన రాజ్ కుమార్ కు మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ శుక్రవారం తెలిపారు. 100కు డయల్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఆర్మూర్ కు చెందిన రాజశేఖర్ పై తొలుత కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ వివరించారు. న్యూసెన్స్ చేసిన ఆ వ్యక్తిని ఆర్మూర్ కోర్టులో హాజరుపరచగా ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ వివరించారు.

Similar News