కామారెడ్డి డీఎస్పీ బదిలీ

కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్ రావు బదిలీ అయ్యారు.

Update: 2024-12-31 10:16 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్ రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీ ఉత్తర్వులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 20న కామారెడ్డి డిఎస్పీగా నాగేశ్వర్ రావు బాధ్యతలు చేపట్టారు. 10 నెలల పాటు ఆయన కామారెడ్డిలో విధులు నిర్వర్తించారు. కాగా నాగేశ్వర్ రావు  జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారనేది ఇంకా తెలియరాలేదు. అయితే అడిషనల్ ఎస్పీగా కొత్తగా వచ్చిన చైతన్య రెడ్డి కామారెడ్డి డిఎస్పీగా వ్యవహరించనున్నట్టు సమాచారం.


Similar News