గృహలక్ష్మి పథకానికి భారీగా దరఖాస్తులు.. మళ్లీ గ్రౌండ్ సర్వే

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గృహలక్ష్మి పథకానికి జిల్లాలో వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. సొంత స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3లక్షలు ఆర్థిక సాయం అందజేస్తుంది

Update: 2023-08-17 02:41 GMT

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గృహలక్ష్మి పథకానికి జిల్లాలో వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. సొంత స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3లక్షలు ఆర్థిక సాయం అందజేస్తుంది. మహిళ పేరిట ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. కాగా ఇందుకు ఈ నెల 10వ తేదీ నుంచి 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇటీవల తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 21,871, కామారెడ్డి జిల్లాలో 20,481 దరఖాస్తులు వచ్చాయి. కాగా లబ్ధిదారుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలదే కీలక పాత్ర కానుండడంతో ఎంత మేరకు అర్హులు పథకానికి ఎంపిక అవుతారనే విషయంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మొదటి విడతలో గృహలక్ష్మి పథకం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి జిల్లాలో దాదాపు 40 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా వారిలో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇది వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం దరఖాస్తు చేసు కున్న వారు ఉండగా ఈసారి కొత్తగా ఏమైనా దరఖాస్తులు చేసుకున్నారా అని పరిశీలిస్తున్న ట్లు తెలిసింది. ఎందుకంటే గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు వేలల్లో దరఖాస్తులు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా దరఖా స్తు చేసుకున్న వారిని వివరాలను సేకరించి సర్వే చేపట్టారు. దరఖాస్తుదారులు ఇచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉన్నవి లేనివి పరిశీలిస్తున్నారు. దాంతో పాటు కచ్చితంగా ఇంటి స్థలం 100 గజాల్లోపు ఉండాలని నిబంధన ఉండడం కచ్చితంగా రేషన్ కార్డు ఉండాలని నిబంధన మేరకు మహిళల పేరు మీద ఉన్న వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణ యించారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షలు కేటా యింపుకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చే ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకున్నారా అని పరిశీలించి వారికి తిరస్కరించనున్నారు. ఉదాహరణకు ఇటీవల దళితబంధు, బీసీలకు చేయూత, మైనార్టీలకు ఇచ్చే లక్ష ఆర్థిక సహాయం పొందిన వారిని కూడా రూ.3 లక్షల గృహలక్ష్మి పథకాన్ని ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది.

అదే మాదిరిగా గృహలక్ష్మి పథకం కేటాయింపు కోసం రిజర్వేషన్లను ఖరారు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో దివ్యాంగులకు 5, ఎస్సీలకు 20, ఎస్టీలకు 10, బీసీలకు 50, జనరల్ కు 15శాతం కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికైతే జిల్లాల వారీగా గృహలక్ష్మి ఎంత మందికి ఇవ్వాలని నిర్ణయం జరుగలేదు. ప్రభుత్వం ఇచ్చే నిదుల ప్రకారం గృహలక్ష్మి పథకం కింద ఇళ్ల నిర్మా ణానికి నిధులు మంజూరు చేస్తారని సమా చారం. కేంద్రం ఆధ్వర్యంలో ఇస్తున్న ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం గృహలక్ష్మి పథకానికి అనుసంధానమా, కాదా అన్నది ఇప్పటికైతే అధికా రులు నిర్ధారించలేదు. దరఖాస్తుల ఆధారంగా ఆయా ప్రాంతాల వారీగా అధికారులు సర్వే చేపట్టి దరఖాస్తులను పరిశీలించనున్నారు. దాని ప్రకారమే రిజర్వేషన్ల ప్రకారం ప్రాంతాలకు ప్రధానంగా నియోజకవర్గాల వారీగానే ఈ కేటాయింపులు ఉంటా యని సమాచారం. ఇటీవల కాలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు కొన్ని నిర్మాణం పూర్తి చేసుకుని పంపకానికి సిద్దంగా ఉండగా అక్కడ వాటిని కేటాయించిన వారికి గృహలక్ష్మి పథకంలో అవకాశం ఇవ్వకుండా చేసేందుకు పకడ్బం దీగా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిన వారి వివరాలను శాఖల వారీగా సేకరించే పనిలో పడ్డారు. గృహలక్ష్మి పథకానికి నిధుల కేటాయింపు మూడు దఫాల్లో ఇవ్వాలని నిర్ణ యించారు. ఇటీవల కాలంలో గృహలక్ష్మి పథ కం కింద బెస్ మెట్ కు రూ.ల క్ష, రూప్ లెవల్ కు రూ.లక్ష, బిల్డింగ్ నిర్మాణం పూర్తయి న తర్వాత మరో లక్ష రూపాయలు మంజూరు చేయ నున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖచ్చితంగా వంద గజాల్లోపు స్థలం యజమానులకు మాత్రమే ఈ కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు.


Similar News