రేపు లబానా లంబాడీల ఏక్తా ర్యాలీ

తమ హక్కుల సాధన కోసం లబానా (కాయితి) లంబాడీలు పోరాటానికి సిద్ధమయ్యారు.

Update: 2023-09-29 10:03 GMT

దిశ, కామారెడ్డి : తమ హక్కుల సాధన కోసం లబానా (కాయితి) లంబాడీలు పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వివిధ రూపాల్లో తమ నిరసన చేపట్టిన కాయితీలు రేపు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. సుమారు 20 వేల మందితో జిల్లా కేంద్రంలో లబానా సమాజ్ ఏక్తా ర్యాలీ పేరుతో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని చర్చ్ కాంపౌండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా, రైల్వే కమాన్, ఇందిరాచౌక్ పంచముఖి హనుమాన్ ఆలయం

     మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందన్నారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చి 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే 245 జీఓ అమలు చేయాలని కోరారు. లబానా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ర్యాలీ తర్వాత ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ర్యాలీ విజయవంతం చేసేందుకు జిల్లాలో ఉన్న కాయితీ లంబాడీలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. 

Tags:    

Similar News